బీఆర్ఎస్ నాయకులు ప్రకటనల మీద రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. డబల్ బెడ్ రూమ్ కట్టిన దగ్గర బీఆర్ఎస్ ఇందిరమ్మ ఇల్లు కట్టిన దగ్గర కాంగ్రెస్ అలానే రైతుబంధు ఇవ్వని వాళ్ళని బీఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కరువుకి బీఆర్ఎస్ కారణమని అనట్లేదు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కారణం కాదన్నారు 40 వేల కోట్ల రుణభారం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నాటీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అంశంపై బీఆర్ఎస్ నాయకులు సమాధానాలు చెప్పాలని అన్నారు కాంగ్రెస్ 120 రోజుల పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 గ్యాస్ సబ్సిడీ 2 యూనిట్లు దాకా ఉచిత విద్యుత్ హామీలను అమలు చేసినట్లు చెప్పారు.