రష్యా, ఇండియా సంబంధా గురించి అందరికి తెలిసిందే. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తే.. భారత్ మాత్రం రష్యా వైపు నిలిచింది. అయితే ఈ యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. అయితే ఈ యుద్ధం కారణంగా పుతిన్ పై అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చినందున పుతిన్.. దేశం విడిచి బయటకు రావడం లేదు.
కానీ మరికొన్ని రోజుల్లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో త్వరలోనే పుతిన్ ఇండియా పర్యటనకు వస్తువుట్లు రష్యా రాజధాని క్రెమ్లిన్ ప్రకటించింది. కానీ అది ఏ రోజున అనే విషయాలు త్వరలనే వెల్లడిస్తాం అని పేర్కొంది. అయితే పుతిన్ ఇండియా పర్యటన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు కారణం కానుంది అనే చెప్పాలి. కానీ ఈ పర్యటన వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేవి మాత్రం తెలియదు.