సోనియమ్మ మా అమ్మ.. ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి తనను సోనియా గులాం అని అంటుండు.. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. సోనియమ్మ 60 సంవత్సరాల తెలంగాణ స్వప్నం నిజం చేసింది. కానీ తెలంగాణ ద్రోహి నరేంద్ర మోడీ. కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నూటికి నూరు శాతం పోయింది. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో బతకడానికి అర్హ కోల్పోయావు.
సిగ్గు లేకుండా మోడీ గులాంనని పేర్కొంటున్నావు. నీకు అధికారం ఇచ్చింది మోడీ కాదు.. సికింద్రాబాద్ ప్రజలు అని గుర్తు చేసుకో. మోడీ గులాం అయితే తట్టబుట్ట సదురుకోని గుజరాత్ కి పో అంటూ కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ దేశంలో సిలిండర్ ధర పెంచారు. కాంగ్రెస్ తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.