ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది : పూనమ్‌ కౌర్‌

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాహుల్‌ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. మహబూబ్‌ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. అయితే.. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్ ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు.

 

మరోవైపు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని రాహుల్‌ గాంధీతో పూనమ్‌ కౌర్‌ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పీహెచ్ డీ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు నేడు రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. యూనివర్సిటీ సమస్యలు రాహుల్ గాంధీకి వివరించారు. వారి సమస్యలపై ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతూ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.. ప్ల కార్డుల్లో అంశాలను రాహుల్ గాంధీ గమనించి వారిని అడిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version