గరికపాటి అవమానంను మరచి పోని మెగాస్టార్..!!

-

దత్తాత్రేయ గారు పెట్టిన అలయ్ బలయ్ కార్యక్రమం రోజు చిరంజీవి , గరిక పాటి మధ్య చెలరేగిన వివాద మంటలు ప్రస్తుతానికి చల్ల బడ్డ సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వివాదాన్ని  రామ్ గోపాల్ వర్మ తన కామెంట్స్ తో మరో స్థాయికి తీసుకు పోయాడు. ఆయన వరస ట్వీట్స్ తో  గరికపాటి పై విరుచుకు పడ్డారు.

ఆ తర్వాత గరికపాటి పై గోగినేని పలు రకాల వ్యాఖ్యలు చేశారు.అరాచకవాది లాగ మహిళలపై చెత్త వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈయనకు ఏమి తెలుసని  శాస్త్రీయ సిద్ధాంతాల గురించి అందరికి చెబుతున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు తగవు అని,   గరికపాటి పై గోగినేని మండిపడ్డారు. తర్వాత కాలంలో ఎవరూ ఏ వ్యాఖ్యలు చేయక పోవడం తో ఈ వివాదం సద్దుమణిగింది.

కాని రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి  మళ్లీ తన కామెంట్స్ వివాదాన్ని గుర్తు చేశారు. ఆ ఈవెంట్ కు వచ్చిన చాలా మంది మహిళలు మెగాస్టార్ తో ఫోటోలు దిగాలని ఇంట్రెస్ట్ చూపించారు. ఒకే సారి చాలా మంది వచ్చి ఫొటోస్ కోసం నిలబడే సరికి చిరంజీవి అటూ ఇటూ చూస్తూ ” వారు ఇక్కడ లేరు కదా” అని ఇన్ డైరక్ట్ గా గరికపాటి పై పంచ్ వేశారు. దానితో అక్కడ వున్న వారంతా గొల్లు మని నవ్వారు. చూస్తూంటే ఆ సంఘటన చిరంజీవి బాగా ఇబ్బంది పెట్టినట్లుగా వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version