ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగ గత కొంత కాలం నుంచి సినీ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే సినీ అభిమానుల దృష్టిలో మార్కులు కొట్టేయడానికి జగన్ సర్కార్.. సోమవారం సినిమా టికెట్ల ధరలను పెంచుతు జీవోను జారీ చేసింది. అయితే ఈ జీవో విడుదలతో జగన్ సర్కార్ కు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు జగన్ సర్కార్ అనేక ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా టికెట్ల ధరలు ఎక్కువగా ఉండకుండా.. చూసింది. అంతే కాకుండా బెన్ ఫిట్ షో లకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిరత్రలోనే మొదటి సారి సినిమా థీయేటర్స్ వద్ద పోలీసులతో పాటు ఎంఆర్వో, డీఆర్వో, కలెక్టర్ వంటి అధికారులు వచ్చి.. సినిమా థీయేటర్స్ లలో టికెట్లు, బెన్ ఫిట్ షో లకు సంబంధించి అడ్డుకున్నారు.
అయితే రాష్ట్రంలో పేదలు ఎక్కువగా ఉన్నారని.. అందుకే సినిమా టికెట్ల ధరలను తగ్గించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.అయితే పవన్ సినిమా రాష్ట్ర ప్రజలు పేదలు గా ఉండి.. కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్న ప్రభాస్ సినిమాకు ధనికులు అవుతున్నారా.. అని సోషల్ మీడియాలో జగన్ సర్కార్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
అలాగే ట్విట్టర్ లో ఒక పోల్ కూడా వైరల్ అవుతుంది. పవన్ సినిమాకు పేదలుగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.. ప్రభాస్ సినిమాకి ధనవంతులు అయిపోయారా.. అంటూ ప్రశ్నిస్తు.. పోల్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోల్ ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ సినిమాకి పేదలుగా ఉన్న ఆంధ్రులు..
ప్రభాస్ సినిమాకి ధనవంతులు అయిపోయారా..#PawanaKalyan #Prabhas𓃵— Manalokam (@manalokamsocial) March 8, 2022