బ్రేకింగ్ : ప్రముఖ నటి ఆత్మహత్య !

-

ప్రముఖ తమిళ టెలివిజన్ సీరియల్ నటి, టీవీ హోస్ట్ చిత్ర సూసైడ్ చేసుకుని చనిపోయింది. తమిళంలో బాగా ఫేమస్ అయిన పాండియన్ స్టోరీస్ సీరియల్ లో నటిస్తున్న ఆమె తన పాత్రతో చాలా ఫేమస్ అయ్యారు, ఈరోజు చెన్నైలోని నజ్రత్‌ పేట్‌ లోని ఒక హోటల్ గదిలో ఆమె శవమై కనిపించారు. పాండియన్ స్టోరీస్ లో ముల్లాగా ఆమె చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అనుమానిస్తున్నారు.

hanging-suicide
hanging-suicide

షూట్ పూర్తయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో ఆమె గదిలోకి వచ్చినట్టు సమాచారం. పోలీసులు చెబుతున్న దాని ప్రకరం హోటల్ మేనేజర్ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 100 కు ఫోన్ చేశాడని ఆమె మరణానికి గల కారణాలు తెలియలేదని అంటున్నారు. చెన్నైలో నివసించే చిత్ర కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె చెన్నైలోని కొట్టూర్పురం నివాసి.

Read more RELATED
Recommended to you

Latest news