ప‌వ‌న్ షూటింగ్ లో కూడా కొట్టేవాడు తిట్టేవాడు..పోసాని సంచ‌ల‌నం..!

-

త‌న ఇంటి పై రాళ్ల దాడి అనంత‌రం పోసాని కృష్ణ ముర‌ళి స్పందించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేశ‌ప‌రుడ‌ని తాను ఎవ‌ర్న‌యినా ఏమైనా అనొచ్చ‌ని కానీ అత‌డిని ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌ద‌న్నారు. మొద‌టి నుండి సైకో బుద్ధి అని ఆర్టిస్ట్ గా షూటింగ్ లోనూ అలాగే ప్ర‌వ‌ర్థిస్తాడ‌ని అన్నారు. షూటింగ్ లోనూ ఎవ‌రైనా ఏదైనా అంటే తిట్ట‌డ‌మో లేదంటే చొక్కా ప‌ట్టుకుని కొట్ట‌డ‌మో చాలా చేశేవాడ‌ని అన్నారు. హీరో కాబ‌ట్టి ఊరుకునేవాడ‌ని..స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ కో డైరెక్ట‌ర్ ను తిట్టాడ‌ని చెప్పారు.

బండ బూతులు తిట్టి అత‌డిదే త‌ప్పు అని తెలిసి కూడా స్వారీ చెప్ప‌కుండా దూరంగా వెళ్లి కూర్చున్నాడ‌ని పోసాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. తానకు ఇండ‌స్ట్రీలో శ‌త్రువులు ఎవ‌రూ లేర‌ని కానీ సైకో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శ్నించా అని పోసాని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జారాజ్యం పార్టీలో ఉన్న‌ప్పుడు కూడా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని పోసాని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version