పవన్ 50 కోట్లు తీసుకుని హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటాడు..పోసాని ఫైర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటాడు అని పోసాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ 10 కోట్లు తీసుకుంటున్నాడు అని చెబుతున్నారని అలా తీసుకుంటే నేను 15 కోట్ల చొప్పున ఇస్తా నాలుగు సినిమాలకు సంతకం చేస్తాడా అని పోసాని ప్రశ్నించారు. అంతే కాకుండా హీరోయిన్, లొకేషన్, రెమ్యునరేషన్, కథ కూడా పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని నిరూపిస్తే తనను చెంప దెబ్బ కొట్టొచ్చని పోసాని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏపిలో ఆన్లైన్ టికెటింగ్ విధానం పై మండి పడ్డ సంగతి తెలిసిందే. తన పై కోపాన్ని ఇండస్ట్రీ పై చూపిస్తున్నారు అంటూ పవన్ ఫైర్ అయ్యారు. దాంతో ఇప్పుడు పోసాని పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.