ఆటో డ్రైవ‌ర్ల స‌మ‌స్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కీలక నిర్ణయం

-

ఆటో డ్రైవ‌ర్ల స‌మ‌స్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపద్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు, కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

KCR was unanimously elected as the leader of the BRS legislative party
Former CM KCR as BRS legislative party leader

ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మరయ్య లు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారు. కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబెర్ మరియు ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేస్తారు. కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news