పురంధేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ముఖం మీద చంద్రబాబు చెప్పులు వేయించాడు. ఎన్టీఆర్ ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గు చేటు అన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చంద్రబాబును పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా..? ఎన్టీఆర్ గొప్ప నటుడు.. ఆయనను అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎందుకు పిలవలేదు.  వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే. చంద్రబాబు అలవాట్లు అన్నీ ఇప్పుడు నారా లోకేష్ కి వచ్చాయి అన్నారు. ఆమెకు అధికారం లేదా ? అని ప్రశ్నించారు. పోలీసులను కొట్టించి సిగ్గు లేకుండా చంద్రబాబు, లోకేస్ సెక్యూరిటీతో రోడ్డుపై తిరుగుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి పరుడు.. నాపై నరేంద్ర చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సవాల్ చేస్తున్నానని పేర్కొన్నారు పోసాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version