పోస్టాఫీసు స్కీమ్స్ లో ఈజీగా ఇలా డబ్బులు వేసుకోవచ్చు తెలుసా..?

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా మనం మంచిగా డబ్బులను పొందొచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన కూడా చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే సుకన్య సమృద్ధి యోజన కూడా పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో ఒకటి. తక్కువ పెట్టుబడులతోనే గ్యారెంటీ రిటర్న్స్‌ను ఈ స్కీమ్ తో పొందొచ్చు.

పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇక ఇది ఇలా ఉంటే స్కీమ్‌ల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు చాలా కష్టంగా ఉంటుంది. దీని కోసం పోస్ట్ ఆఫీస్ కి వెళ్లడం ఇవన్నీ కూడా శ్రమే. కానీ అలా కాకుండా ఇంట్లో కూర్చునే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్ లేదంటే రికరింగ్ డిపాజిట్స్ లో డబ్బులు డిపాజిట్ చెయ్యచ్చు.

ఇండియన్ పోస్ట్ బేసిక్ ఫంక్షన్లను ఆన్‌లైన్‌గా పొందే అవకాశాన్ని ఇస్తోంది. ఐపీపీబీతో ఈజీగా బ్యాలెన్స్ కూడా చెక్ చెయ్యచ్చు. డబ్బులను కూడా ట్రాన్స్ఫర్ చెయ్యచ్చు. కేవలం మీరు ఏదైనా స్కీమ్ ని ఓపెన్ చెయ్యడానికే పోస్టాఫీసుకి వెళ్లాల్సి ఉంది. ప్రతీది కూడా ఐపీపీబీ అకౌంట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు.

అంతే కాక ‘DakPay’డిజిటల్ పేమెంట్స్ యాప్‌ కూడా వుంది. పోస్టాఫీసు, ఐపీపీబీ కస్టమర్లు దీన్ని ఉపయోగించుకుని సేవలను పొందొచ్చు. ఇలా ఎవరైనా సరే పోస్టాఫీసు స్కీమ్స్ లో ఈజీగా డబ్బులు వేసుకోవచ్చు. ఎటువంటి శ్రమా లేకుండా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version