టీఆర్టీ-2017 ఉపాధ్యాయ అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్ : సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష అయిన టీఆర్టీ – 2017 లో రాసిన ఏజెన్సీ ఏరియాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల‌కు పోస్టింగ్ ఇవ్వ‌నున్నన‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టన చేశారు. దీంతో టీఆర్టీ – 2017 లో ఏజెన్సీ ఏరియాకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న 151 మంది ఉపాధ్యాయ అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్ లు రానున్నాయి.

ఈ పోస్టింగ్ ల‌కు సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లకు సీఎం కేసీఆర్ సూచ‌న మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ క‌మిషన‌ర్ శ్రీ దేవ‌సేన ఆదేశాలను జారీ చేశారు. కాగ ఈ టీఆర్టీ – 2017 కు సంబంధించి ఏజెన్సీ ఏరియా అభ్య‌ర్థుల పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్ర రెడ్డి, సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దాదాపు ఐదు సంవ‌త్స‌రాల నుంచి ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించినంద‌కు ఆయా ఉపాధ్యాయ అభ్య‌ర్థులు సీఎం కేసీఆర్ కు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version