అజ్ఞాతం వీడిన పొట్లూరి వరప్రసాద్‌

-

ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేత, బడా నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) అజ్ఞాతం వీడారు. జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​లో పీవీపీ ఉన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు పీవీపీపై ఉంది. కొద్ది రోజులుగా పీవీపీ అజ్ఞాతంలోకి వెళ్లారు.అసలు ఏమైంది అంటే.. పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

Vara prasadh

”15 నెలల క్రితం పీవీపీ విల్లాస్​లో విక్రమ్ కైలాస్ ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. కొన్ని మార్పుల దృష్ట్యా ఇంటిపై అదనంగా నిర్మాణాలు ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ పీవీపీ 15 మంది వ్యక్తులతో అక్కడకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు కైలాస్ తెలిపారు. అదనంగా చేస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మేము ఘటన స్థలానికి చేరుకునే లోపే కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మాణాలను అడ్డుకునే హక్కు పీవీపీకి లేదు. సర్వాధికారుల సొసైటీకే ఉన్నాయి. దీనిపై మరింత విచారణ జరుపుతాం. అక్రమ చొరబాటుకు, బెదిరింపులకు, ధ్వంసం చేసినందుకు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశాం. అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version