వకీల్ సాబ్ రివ్యూ : పవర్ స్టార్ మేనియాతో వకీల్ సాబ్.. అన్ని సినిమాలు ఓ లెక్క వకీల్ సాబ్ ఓ లెక్క.

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్యా నాగల్ల ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో మనలోకం రివ్యూలో చూసేద్దాం.

కథ :

సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) న్యాయం కోసం పోరాడే లాయర్. ముగ్గురు నిరాశ్రయులైన మహిళలు సత్యదేవ్ సహాయం కోసం వస్తారు. ఎంపి తనయుడు (సాయి కృష్ణ) మీద కేస్ వేస్తారు. ఎంపిని ఛాలెంజ్ చేసి మరి ఆ కేస్ టేకప్ చేస్తాడు సత్యదేవ్. మరోపక్క ఎంపి తనయుడిని కాపాడటానికి సీనియర్ లాయర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) ప్రయత్నిస్తుంటాడు. సత్యదేవ్ తో ఢీ కొట్టిన నంద గోపాల్ కేసుని ఎలా గెలవాలని అనుకున్నాడు. వకీల్ సాబ్ సత్యదేవ్ ఈ కేసుని ఎలా వాదించాడు. చివరకు కేసు ఎవరు గెలిచారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమా మూల కథను తీసుకుని దాని పవన్ కళ్యాణ్ స్టార్ క్రేజ్ కు తగినట్టుగా మార్పులు చేసి వకీల్ సాబ్ తీశాడు. ఈ విషయంలో డైరక్టర్ వేణు శ్రీరాం కు 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చేయొచ్చు. ఓ బలమైన కథను బలమైన హీరోతో చెప్పించాలన్న ప్రయత్నం మెప్పించింది. అయితే పవర్ స్టార్ ఉన్నాడు కదా అని సినిమా సబ్జెక్ట్ ను దెబ్బకొట్టేలా అనవసరమైన ఒక్క సీన్ రాసుకోలేదు.

ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ కోర్ట్ రూం సీన్స్ ఆడియెన్స్ ను అలరిస్తాయి. ఆ సన్నివేశాలు సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆడియెన్స్ కు ట్రీట్ ఇస్తుంది. ఎక్కడ గ్రాఫ్ తగ్గకుండా క్లైమాక్స్ వరకు వెళ్తుంది.

సినిమాలో మరో హైలెట్ థమన్ మ్యూజిక్.. సాంగ్స్, బిజిఎం అదిరిపోయాయి. పింక్ తెలుగు రీమేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడం ఒక ఎత్తైతే డైరక్టర్ వేణు శ్రీరాం దాన్ని కన్విన్స్ చేసిన విధానం అదిరిపోయింది. మూల కథ దెబ్బతినకుండా పవర్ స్టార్ ఇమేజ్ కోసం పెట్టిన ఒకటి రెండు ఫైట్స్ మెప్పించాయి.

నటీనటుల ప్రతిభ :

వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా ది బెస్ట్ ఇస్తాడు అనడంలో తిరుగులేదు. సత్యదేవ్ పాత్రలో మరోసారి తన బలమైన భావజాలాన్ని ప్రదర్శించాడు. ఓ విధంగా బయట ఉన్న నిజమైన పవన్ కళ్యాణ్ స్వభావం సత్య దేవ్ పాత్రలో కనిపిస్తుందని చెప్పొచ్చు. సినిమాలో పవన్ కు పోటీగా నంద గోపాల్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటన ఎప్పటిలానే మెప్పించింది. శృతి హాసన్ ఉన్న కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. నివేదా థామస్ నటన చాలా బాగుంది. అంజలి, అనన్య నాగల్ల కూడా బాగా చేశారు. వంశీ కృష్ణ కూడా మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేం చాలా అద్భుతంగా తీశారు. కోర్ట్ సీన్స్ లో కెమెరా మెన్ ప్రతిభ కనబడ్డది. థమన్ మ్యూజిక్ రిలీజ్ కు ముందే సూపర్ హిట్ కాగా బిజిఎం తో మరోసారి ది బెస్ట్ అనిపించుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. వేణు శ్రీరాం తన టాలెంట్ చూపించాడని చెప్పొచ్చు. వకీల్ సాబ్ తో ఆయన ప్రతిభ కనబడ్డది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఖుషి అయ్యేలా ఆయన డైరక్షన్ ఉంది.

ప్లస్ పాయింట్స్ :

పవర్ స్టార్ మేనియా

థమన్ సంగీతం

కోర్ట్ రూం సీన్స్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అవడం

బాటం లైన్ : పవర్ స్టార్ మేనియాతో వకీల్ సాబ్.. అన్ని సినిమాలు ఓ లెక్క వకీల్ సాబ్ ఓ లెక్క.

రేటింగ్ : 4/5

 

Read more RELATED
Recommended to you

Exit mobile version