ఏ పని చేసినా ఏ సమయంలో చేస్తున్నామనేది ముఖ్యంగా ఉంటుంది. భోజనం చేయడానికి ఒక సమయం అంటూ ఉన్నట్టే, ఉదయం లేవగానే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పనులు చేయకూడనివి కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోకపోతే దీర్ఘకాలంలో పెద్దగా నష్టపోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెడ్ మీద ఉండగా సెల్ ఫోన్ పట్టుకు దాన్లో కాలం గడపడం కరెక్ట్ కాదు. పొద్దు పొద్దున్న సెల్ ఫోన్ నుండి వచ్చే నీలి కాంతి మీ కళ్ళ మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే బెడ్ మీద ఫోన్ పట్టుకుని కూర్చోకండి.
అలారం పెట్టుకుని అది మోగగానే లేవకుండా పది నిమిషాలకి ఒకసారి మళ్ళీ మళ్ళీ అలారం పెట్టుకుంటారు. అలా ప్రతీ పది నిమిషాలకి నిద్రలేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. మిమ్మల్ని పూర్తిగా నిద్రపోనివ్వకుండా ఎప్పుడూ ఏదో ఆలోచించేలా చేసే ఈ పనులు చేయవద్దు.
లేవగానే తీపి పదార్థాలు తినకుండా ఉండండి. పొద్దు పొద్దున్న మీ శరీరానికి నీళ్ళని ఇవ్వండి. అంతే కానీ, తీపి పదార్థాలని ఆహారంగా ఇవ్వవద్దు.
బెడ్ మీద టక్కున లేవకండి. అలాగే ఎక్కువ సేపు బెడ్ మీద ఉండకండి. నిద్రలోంచి బయటకు వచ్చాక కొద్దిసేపు బెడ్ మీదే ఉండండి. నిద్ర దిగిపోయిందని మీకు అనిపించినపుడు లేవండి.
లేవగానే ఇష్టం వచ్చిన పని చేయకండి. లేచే ముందే ఈ రోజు ఏమేం పనులు చేయాలనేది డిసైడ్ అవ్వండి. అంతే కానీ, మీ దారిలో వచ్చిన ప్రతీ పనీ చేసుకుంటూ వెళ్లవద్దు. అది మీ రోజుని సంపూర్ణంగా గడపనివ్వదు.
ఈమెయిల్స్ చెక్ చేసుకోవడమూ మంచిది కాదు. ఫోన్ ఎలా ముట్టుకోకూడదో, కంప్యూటర్ ముట్టడమూ తప్పే.