ప్రభాస్ నా కొడుకన్న అనుష్క…!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరో అనుష్క, ప్రభాస్ వివాహం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై వాళ్ళ నుంచి ఏ స్పందన లేకపోయినా సరే మీడియా మాత్రం వారి గురించి రోజుకో వార్త ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఏదోక రూపంలో వాళ్ళను మీడియాతో ఉంచుతారు.

అనుష్క పెళ్లి విషయంలో ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై అనుష్క ఏ మాత్రం స్పందించలేదు. ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. తాజాగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హేమంత్ మధుకర్ రూపొందించిన నిశ్శబ్దం చిత్రంలో అనుష్క నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెల రెండున విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ అనుష్క బాగానే చేస్తుంది.

తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్ళిన అనుష్క… ఒక ఆసక్తికర కామెంట్ చేసింది. ప్రభాస్ ఫోటోను సుమ అనుష్కకు చూపించింది. వెంటనే అతను నా కొడుకు అని సమాధానం చెప్పగా సుమా షాక్ ఇచ్చింది. సరే.. కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమని సుమ అడగగా… అందుకే కదా ఈయన నాకు కొడుకు అయ్యాడంటూ అనుష్క మరో పంచ్ వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version