మేకప్ మేన్ కి కరోనా.. క్వారంటైన్లోకి ప్రభాస్.

రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్, క్వారంటైన్లోకి వెళ్ళాడు. తన మేకప్ మేన్ కి కరోనా అని తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్నందున క్వారంటైన్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం మేకప్ మాన్ కరోనా లక్షణాలను కలిగి ఉండడంతో టెస్టుకి వెళ్ళాడు. పాజిటివ్ అని తేలింది. దాంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నారు. చివరి దశలో ఉన్న చిత్రీకరణని ప్రస్తుతం ఆపేసారు. ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణం రాజుల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది.

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరల చిత్రీకరణ జరపనున్నారు. రాధేశ్యామ్ షెడ్యూల్ కి అంతరాయం ఏర్పడడంతో ఆ ప్రభావం, ఆదిపురుష్, సలార్ చిత్రాలపై పడనుంది. అంతే కాదు చిత్రీకరణ వాయిదా పడడంతో రిలీఝ్ డేట్ పై ప్రభావం ఉంటుంది. కే రాధా క్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధేశ్యామ్ సినిమాని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పీరియాడికి డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేమకథగా తెరకెక్కుతోంది.