కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో 18ఏళ్ళు పైబడిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ని సప్లై చేయనున్నారు. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అనుమతులు ఇచ్చేసారు. ఐతే వ్యాక్సిన్ల రేట్లలో తేడాలు కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సప్లై చేయడానికి 150రూపాయలైతే, రాష్ట్రప్రభుత్వాలకి అమ్మడానికి 400రూపాయలుగా నిర్దేశించడం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.
ఇప్పటికే తెరాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా, తన సందేహాన్ని వెలిబుచ్చాడు. ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి వస్తుసేవల పన్ను ఉండగా కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వాలకి వ్యాక్సిన్లని అమ్మే విషయంలో ఇంత తేడాలు ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ఏం అంటారో చూడాలి. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 400రూపాయలు కాగా, ప్రైవేటు ఆస్పత్రులకి 600గా నిర్దేశించారు.