ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహా భారీ ఎత్తున ఆగస్టు 30న రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటివరకూ ప్రమోషన్ ను కేవలం సోషల్ మీడియా ద్వారానే చేసారు. నేరుగా రంగంలోకి దిగి వేడెక్కించింది లేదు. ఈ నేపథ్యంలో దక్షిణాది సహా ముంబైలో భారీ ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఆ సినిమా ఆడియోను కూడా లాంచ్ చేయబోతున్నారు. ముందుగా ఆగస్ట్ 17న అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో తొలి ఈవెంట్ జరగనుంది. ఎల్ బీ స్టేడియం వేదికగా ఎంచుకున్నారంటే? ఈవెంట్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేసారో తెలుస్తోంది.
ఎల్ బి స్టేడియం అంటే వేలాది మంది సామర్ద్యం గలది. కాబట్టి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. అదే నెల 21 కేరళలోని కొచ్చి లో మరో ఈవెంట్ చేస్తున్నారు. అటుపై ఆగస్టు25న బెంగుళూరులో భారీ ఈవెంట్ చేయనున్నారుట. చివరిగా ఆగస్ట్ 27న ముంబైలో మరో ఈవెంట్ చేయనున్నారని తెలిసింది. ఇలా నాలుగు రాష్ర్టాల రాజధానుల్లో సాహో ప్రచారంతో దుమ్ము లేపనున్నాడు. అయితే చెన్నైలో మాత్రం ఎలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. కానీ కోలీవుడ్ లో మాత్రం కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతోనే అక్కడ ఎలాటి ఈవెంట్ ప్లాన్ చేయనట్లు తెలుస్తోంది. మిగతా భాషల్లో అనువాద రూపంలో రిలీజ్ కానుంది.
బాహుబలితో జాతీయ స్థాయిలో ప్రభాస్ కు గుర్తింపు రావడంతోనే యూవీ క్రియేషన్స్ ప్రమోషన్స్ ను ఈరేంజ్ లో ప్లాన్ చేసింది. 300 కోట్ల భారీ బడ్.జెట్ తో చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆ అంచనాలను సాహా అందుకుంటుందో ? లేదో మరో నెల రోజుల్లో తెరపడిపోద్ది. ప్రస్తుతం సాహో ప్రమోషన్ టీమ్ ఈ ప్రచార పనుల్లోనే బిజీగా ఉన్నట్లు సమాచారం