మంచు విష్ణుతో మళ్లీ సినిమానా.! నిజమేనా.!

-

టాలీవుడ్ లో మంచు కుటుంబం ది ఒక ప్రత్యేక మైన గుర్తింపు వుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ పై అందరూ గౌరవం తో వుండే వారు.రాను రాను వారి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయ్యింది అని , కొంత బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల మరియు సినిమాలలో కంటెంట్ సరిగా లేకపోవటం తో వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే రీసెంట్ గా హీరో మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం   జిన్నా. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది.

అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు వున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమా కోసం  ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసినా, మరీ తీసి వేయదగ్గ సినిమా కాకపోయినా, రివ్యూ లు కూడా పరవాలేదు అన్నా కూడా ప్రేక్షకులు సినిమా ను చూడలేదు. కలెక్షన్స్ మరీ దారుణంగా  80 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక డబ్బులు థియేటర్స్ కే తిరిగి కట్టాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

ఇలాంటి పరిస్థితి లో వున్న విష్ణు కు ప్రభుదేవా సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.జిన్నా సినిమాకు ఒక సాంగ్ కు కూడా ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అప్పుడే వీరి మధ్య చర్చలు జరిగాయట. తన దగ్గర ఒక కథ వుందని దాన్ని విష్ణు కి చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.కాక పోతే నిర్మాత గా కూడా విష్ణు మాత్రమే వుండే అవకాశం ఉందట.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే అవకాశం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version