అతడితోనే లిప్ లాక్ చేస్తానంటున్న ప్రగ్యా జైస్వాల్

-

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కెరీర్ సాగుతోంది. అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు అనుకున్న విధంగా ఆఫర్లు రావడం లేదు. దీంతో సీనియర్ హీరోలైనా పరవాలేదు అని సరిపెట్టుకుని మూవీలు చేస్తుంది. తెలుగుతో పాటు అనేక భాషల్లో సినిమాలు చేస్తున్నా… ఎక్కడా కూడా సరైన బ్రేక్ రావట్లేదు. కంచెలో తనతో కలిసి నటించిన వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇలా చూసుకుంటే అమ్మడుకి అదృష్టం కలిసి రావట్లేదనే చెప్పాలి. అందాల ఆరబోతలో ఏ మాత్రం తీసిపోకపోయినా అమ్మడు లక్ మాత్రం మారట్లేదు.

ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తో కలిసి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ మెదలుపెట్టింది. ఇందులో మూవీ హీరోయిన్ ప్రగ్యా కూడా పాల్గొంటుంది. ఇటీవలే నెటిజన్లతో ఈ ముద్దుగుమ్మ చేసిన చిట్ చాట్ లో కింది విషయాలను పంచుకుంది. తిరిగి ప్రారంభమైన తర్వాతీ మొదట రోజు అఖండ షూటింగ్ కు వెళ్లగానే అక్కడ దాదాపు 200 మంది ఉండడం చూసి ఈ అమ్మడు తీవ్ర ఆందోళన చెందిదట. కానీ తర్వాత కుదురుకున్నానని చెప్పింది. అనంతరం ఓ నెటిజన్ ఈ ముద్దుగుమ్మను మీరు మొదటి రోజు డేటింగ్ కు వెళ్లినపుడు లిప్ లాక్ పెడతారా అంటూ బోల్డ్ గా ప్రశ్నించాడు. దీనిపై ప్రగ్య స్పందిస్తూ…. డేటింగ్ వెళ్లినంత మాత్రాన ముద్దులు పెడతారా అంటూ ఆ నెటిజన్ కు బదులిచ్చింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version