Praja Palana : ప్రజాపాలనపై సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌

-

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సి ఎస్ శాంతి కుమారి తొలిరోజు ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా అభినందనలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్ ఫారాలు విక్రయించకుండా చూడాలని ఆదేశించింది.

 

దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ చూడాలని,అభయహస్తం అప్లికేషన్లు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 100 మంది దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి , మహిళలకు ,పురుషులకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

షామియానా, బారికేడింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు.గ్రామసభల షెడ్యూల్‌పై మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ,జిల్లా అధికారులందరూ కలిసి కృషి చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో సందీప్ కుమార్ సుల్తానియా,మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news