Prakash Raj : “నా కూతురు పెళ్లితో నాకు సంబంధం లేదు.. కానీ, ఎన్ని డబ్బులైనా ఇస్తా”.. ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Prakash Raj: ప్రకాశ్ రాజ్ గురించి సినీ ప్రేమకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయ‌న విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇటీవల జ‌రిగిన మా ఎలక్షన్స్ తో మరింత ఫేమ‌స్ అయ్యాడు. ఈ పోటీలో మంచు విష్ణు తో త‌ల‌ప‌డి ఓట‌మి పాల‌య్యాడు. ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ ఓ ఇంట‌ర్యూలో తన పర్సనల్ లైఫ్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన మొదటి భార్య లలిత కుమారి (లత)కి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో తెలియజేశారు. ఇప్పుడి ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. తన మొదటి భార్య లలిత కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.
అయితే.. ఓ యాక్సిడెంట్‌లో ప్ర‌కాశ్ రాజ్ త‌న ఐదేండ్ల కొడుకును కోల్పోయారు. దీంతో 2009 లో లలితకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ డ్యాన్సర్ పోనీ వర్మను వివాహమాడాడు. వీరికి వేదాంత్ అనే కొడుకు ఉన్నారు. తన పిల్లల విషయంలో ఎప్పుడు వారికి తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన పెద్ద కూతురు పూజ చదువు పూర్తి చేసిందని, సంగీతంలో తనకు ఇంట్రెస్ట్ ఉందని, అందులో తాను ఎదగాలనుకొంటుందని చెప్పారు.

అయితే తన పిల్లల విషయంలో ఎప్పుడూ తోడుగా ఉంటాననీ, ఒక వేళ వారు ఇండస్ట్రీకి ఏంట్రీకి హెల్ప్ చేయమంటే చేస్తాన‌ని అన్నారు. తన పెద్ద కూతురు పూజ ప్రస్తుతం చదువు కంప్లీట్ చేసిందని సంగీతం అంటే తనకు ఎక్కువ ఇష్టమని తాను ఆ రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటుదని చెప్పుకొచ్చాడు.
కానీ, తన పెళ్లి విషయంలో ఒక తండ్రిగా ఉండలేనని తెలిపారు.

పెళ్లికి కావాల్సిన డబ్బులు పంపిస్తాను.. వారు పిలిస్తే పెళ్ళికి వెళ్లి అక్షింతలు వేస్తాను అంతే.. ఈ విషయం త‌న కూతురు కూడా తెలుసున‌ని చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కూతురు పెళ్లికి పిలిస్తే వెళ్లడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కుటుంబ సభ్యుల విషయంలో అంత కఠినంగా ఉంటే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version