ఢిల్లీ: ప్రాంతీయ పార్టీలతో “ధర్డ్ ఫ్రంట్” ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో శరద్ పవార్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. “జాతీయ కూటమి” ఏర్పాటు దిశగా వీళ్ల ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. బిజేపి కి ప్రత్యామ్నాయంగా బలమైన “కూటమి” ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. రెండు వారాల్లోనే రెండు సార్లు పవార్, ప్రశాంత్ కిషోర్ సమాలోచనలు జరిపారు… జూన్ 12 వ తేదీన ముంబైలో శరద్ పవార్ నివాసంలో మూడు గంటల పాటు సమాలోచనలు జరుపగా… ఈ రోజు ఢిల్లీ లో మరోసారి అరగంట పాటు చర్చలు సాగాయి.
అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న ప్రశాంత్ కిషోర్… ప్రధాని మోడికి పోటీగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడును ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోడి నేతృత్వంలోని అధికార బిజేపికి దీటుగా, రాజకీయ పార్టీ లన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పీకే. పీకే స్కెచ్.. ఎంతవరకు విజయవంతం అవుతుందో ఇక చూడాలి.