గెలిచినా.. ఓడినా.. బీజేపీ ఎక్కడికి వెళ్లదు – ప్రశాంత్ కిశోర్

-

ప్రముఖ పోలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచినా ఓడినా మరో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లాగా బీజేపీ ఎక్కడికి వెళ్లదు, ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గోవా ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గోవాలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడిని విడియో వైరల్ గా మారింది. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సమావేశంలో ప్రశాంత్ కిశోర్ బీజేపీపై వ్యాఖ్యలు చేశారు.  భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్రంగా ఉంటుందని, రానున్నమరికొన్ని దశాబ్ధాలు పార్టీ ఉంటుందని అన్నారు. ప్రజలు బీజేపీని తక్షణం తరిమికొడతారనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఒక్కసారి 30 శాతం ఓట్లు సాధించిన తర్వాత మోదీ, బీజేపీ పార్టీ ఆదరణ కోల్పోతుందనే ఉచ్చులో ఎప్పుడూ పడకూడదని వ్యాఖ్యానించారు. తొందరపడవద్దని రానున్న కొన్ని దశాబ్దాలు బీజేపీలో పోరాడాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ కు, తమిళనాడులో డీఎంకేకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవరించారు. ఆయ రాష్ట్రాల్లో ఈ పార్టీలను గెలిపించారు. ప్రస్తుతం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గోవా ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version