ప్రవళిక వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీసింది

-

ప్రవళిక ఆత్మహత్య చేసుకుని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేసిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు.  ప్రవళిక సూసైడ్‌పై ప్రభుత్వం, కేటీఆర్, పోలీసుల అసత్య ప్రచారంపై నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.  ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్, AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడారు. 

‘ప్రభుత్వ ఉద్యోగం ధ్యేయంగా ప్రవళిక హైదరాబాద్‌కి వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతనే.. ఇంటికి వస్తా అని ఇంట్లో చెప్పింది. పేపర్ లీకేజ్, పరీక్ష రద్దు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవళిక వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలే. రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ప్రకటనపై చర్చకు సిద్దమా?. జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రకటించడం లేదు. టీఎస్‌పీఎస్‌  ను రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్న స్పందన లేదు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్  మేనిఫెస్టోలో పెన్షన్, రైతుబంధు, గ్యాస్ ధర తప్ప.. ఎక్కడా ఉద్యోగాల ఊసే లేదు. నిరుద్యోగులపై అడిగే ప్రశ్నలకు ఒక్క సమాధానం ఇస్తే.. ముక్కు నాలకు రాస్తా. ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెడుతాం అంటే.. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని పోలీసులు అంటున్నారు. ప్రవళిక పైన వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ పెడితే.. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారు.’’ అని కోదండరాం ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version