ఎన్నికల్లో మద్యం, డబ్బు పెంచకుండా ఎన్నికల్లోకి వెళ్దాం : రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌  మంత్రులు హరీష్ రావు  కేటీఆర్  పదే పదే కాంగ్రెస్‌  పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి   అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారని, బీజేపీ,  బీఆర్ఎస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయని రేవంత్ ఆరోపించారు.

నెలరోజుల్లో రూ. 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే… మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో రూ. 300 కోట్ల మద్యం అమ్మారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదని స్పష్టం చేశారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారన్నారు. మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగిందన్నారు. అందుకే తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసిరానని, చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరానని రేవంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version