ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వ కసరత్తు…!

-

ఉద్యోగుల సమ్మె, పెన్ డౌన్ పై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఇప్పటికే… సీఎం అధ్యక్షతన ఉద్యోగుల సమ్మెపై క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. మంత్రులు బుగ్గన, బొత్స తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమ్మెకు వెళ్లే ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్దం అవతున్నట్లుగా సమాచారం. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు.. ఎస్మా ప్రయోగించే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. ఏయే శాఖలను ఎస్మా పరిధిలోకి వస్తాయని జీఏడీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసమైతే ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఎస్మా పరిధిలోకి వస్తాయని పీఆర్సీ సాధన సమితి అంటుంది. ఆరో తేదీ అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతున్న సమ్మెలో ఎక్కడా కూడా అత్యవసర సేవలను నిలుపుదల చేయడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల సరఫరా వంటి వాటిని తాము అడ్డుకోవడం లేదన్న ఉద్యోగ సంఘ నేతలు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version