వేసవిలో కోళ్ల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

సమ్మర్ లో మనుషులే కాదు.. నోరు లేని జంతువులు కూడా చాలా ఇబ్బంది పడతాయి. మనమన్నా.. సమస్య ఏంటి అనేది చెప్పగలుగుతాం.. ఇక గెదలు, కోళ్లు, మేకలు లాంటివి అయితే.. ఎండకు ఉక్కిరిబిక్కిరి అవుతాయి. కోళ్లను వేసివిలో ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఊరికే చనిపోతాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ నష్టాలను తప్పించుకోవచ్చు.

వేసవిలో సాధారణంగా కోళ్లు తక్కువ నాణ్యత కలిగిన ఆహారం తీసుకోవటం, కలుషిత నీరు తాగటం, గాలి, పరాన్న జీవుల వల్ల త్వరగా వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కన్నా వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతుంటాయి. తక్కువ మేత తీసుకుంటాయి. ఎక్కువ నీటిని తాగుతాయి. ఇలాంటి సందర్భంలో వడదెబ్బకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువ. దీన్ని అధిగమించేందుకు షెడ్లపై కొబ్బరి మట్టలు, వరిగడ్డి వేసుకుని నీటితో తడపాలి. గోడలు తక్కువ ఎత్తులో నిర్మించుకుని పట్టాలు కట్టి వాటిని తడుపూ షెడ్డు వాతావరణాన్ని చల్లగా మార్చాలి.

కోళ్ల గుడ్డు ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు కోళ్ళకు షెడ్డులో చల్లని వాతావరణం కల్పించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. తాగేందుకు చల్లని నీటిని అందించే ఏర్పాటు చేయాలి.. కోళ్ల ఫారాలను శుభ్రంగా ఉంచుకోవటంతోపాటు, గుడ్లు పెట్టిన వెంటనే తీసివేయాలి. నీటిలో ప్రొటీన్, గ్లూకోజ్, బీకాంప్లెక్స్ ద్రావణాన్ని తగిన మోతాదులో కలిపి అందించటం వల్ల కోళ్లు ఎండకు అలిసిపోకుండా ఉంటాయి.

వ్యాధి నిరోధకత కోసం వైద్యుల సలహాల మేరకు టీకాలు వేయించాలి. కొక్కెర వ్యాధి సోకే ప్రమాదం కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. షెడ్లలోకి వడగాలి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5గంటల లోపు కోళ్లకు పోషకాలు కలిగిన మేతను అందించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవి నుండి కోళ్లను కాపాడుకోవచ్చు.

ఇలాంటి తేలికపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది.. దాంతో రైతుకు కూడా మంచి లాభాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version