విమానాల్లో ప్రసవాలు జరగడం గురించి మనం వింటూనే ఉంటాం. అలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇది కొంత మంది అద్రుష్టంగా కూడా భావిస్తూ భావిస్తూ ఉంటారు. తాజాగా మనీలాకు చెందిన ఓ మహిళ ముప్పై వేల అడుగుల ఎత్తులో ప్రసవించింది. దుబాయ్ నుంచి మనీలాకు ఈ నెల ఆరున బయల్దేరిన ఫిలిప్పిన్స్ ఎయిర్ లైన్స్‌కు పీఆర్659 విమానంలో,
ప్రయాణిస్తున్న గర్భిణికి ఉన్నట్టుండి పురుటినొప్పులు వచ్చాయి. దీనితో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది… ఎయిర్‌లైన్ ప్రతినిధుల దృష్టికి వెంటనే తీసుకుని వెళ్ళారు. వారు వెంటనే స్పందించి డాక్టర్‌ను సంప్రదించి శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం సిబ్బంది వెంటనే పీపీఈ కిట్లు ధరించారు. దీనితో ఆమెకు కాన్పు చేసారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఈ వ్యవహారం గడిచింది.
30 వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు పుట్టిన శిశువుకు స్వాగతం పలికారు విమానయాన సిబ్బంది… అరుదైన అవకాశంగా భావించారు. అక్కడే అందరితో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. దీనిని ఇతర ప్రయాణికులు ఫోటోలు వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పుట్టిన శిశివుతో ఫొటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.