ఏపీలోని అటవీప్రాంతంలో నివసించే గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. వారికి సరైన రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎవరైనా అనారోగ్యం బారిన డోలీలే వారికి దిక్కు అవుతున్నాయి.
తాజాగా ఓ నిండు గర్భిణికి మెడికల్ చెకప్ కోసం కుటుంబ సభ్యులు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూలపేట పంచాయతీ జాజులబంధలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ కర్రకు దుప్పట్లను కట్టి అందులో నిండు గర్బిణిని తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలిచి వేస్తున్నాయి. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాలకు రోడ్లు, వైద్యం సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
గిరిజనులకు తప్పని డోలీ మోతలు
సరైన రోడ్డు, రవాణా సదుపాయం లేక నిండు గర్భిణిని నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూలపేట పంచాయతీ
జాజులబంధలో ఘటన@PawanKalyan @naralokesh @APDeputyCMO @OfficeofNL @ncbn @AndhraPradeshCM pic.twitter.com/QCiuWOs1Dx— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025