రేవంత్ కు షాక్..3వేల మందితో గాంధీ భవన్ కు ప్రేమ్ సాగర్ రావు…!

-

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు షాకిచ్చారు. రాష్ట్ర పార్టీకి ప్రేమ్ సాగర్ రావు అల్టిమేటం జారీ చేశారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో 500 మంది కింది స్థాయి నాయకులతో ప్రేమ్ సాగర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్, కుమ్రంబీమ్ జిల్లాల నాయకులు హాజరు కానున్నారు. ఆయన వర్గానికి చెందిన మడలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను మార్చడంతో ప్రేం సాగర్ రావు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. డిసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ‌మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిల పై ప్రేం సాగర్ రావు మండి పడుతున్నారు.

ఈనెల 10వ తేదీన 3000 మందితో ప్రేమ్ సాగర్ రావు గాంధీ భవన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అమీ తుమీ తేల్చుకుంటామని ఆయన చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్ పేరుతో పార్టీ పెడితే 15 మందిని గెల్పించుకునే సత్తా ఉందని ఆయన చెబుతున్నారు. 15 మందితో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మారుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రవల్లి సభ ఎవరి వల్ల సక్సెస్ అయ్యిందో రాష్ట్ర మంతా తెలుసు అని ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావుతో భట్టి విక్రమార్క తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తనాకు కాల్ చేస్తున్నారని…నా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని ప్రేమ్ సాగర్ రావు చెబుతున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version