బొక్కలు ఇరుగుతయ్ కొడుకా! గువ్వల బాలరాజు బూతు పురాణం

-

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఓటములపై సవాల్ అంశం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచిన మరుసటి రోజు నుంచే ఆయనకు తలనొప్పి మొదలైంది. కొంత మంది గువ్వల బాలరాజుకు నేరుగా ఫోన్ చేసి ‘ఎప్పుడు రాజీనామా చేస్తావ్’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫోన్లపై ఫోన్లు చేస్తూ ఆయన్ని ఠారెత్తిస్తున్నారు. ఓ వ్యక్తి పదేపదే ఫోన్ చేస్తూ సహనం కోల్పోయిన గువ్వల బాలరాజు బూతు పురాణం ఎత్తుకున్నారు.

 

ఫోనులో వ్యక్తి: నమస్తే సార్
ఎమ్మెల్యే: ఏమైంది వయా మళ్లమళ్ల చేస్తున్నావ్
ఫోనులో వ్యక్తి: సర్ నువ్వు రాజీనామా చేయాల్సిందే! నీ నియోజకవర్గంలో డెవలప్‌మెంట్ లేదు. మంది నియోజకవర్గంలోకి ప్రచారం చేయడం ఏమిటి సార్. అర్థం కాదు
ఎమ్మెల్యే: హేయ్ పెట్టేయ్ బే పెట్టేయ్. నువ్వు ఎవడివి రా సాలే. నాకు ఫోన్ చేస్తవ్. ఫోన్ పెట్టేయ్ బే పెట్టేయ్.
ఫోనులో వ్యక్తి: సార్, మీరు ప్రజాప్రతినిధి ఓ వ్యక్తితో ఇలాగేనా మాట్లాడేది.
ఎమ్మెల్యే: ఎవనివి రా సాలే నాకు ఫోన్ చేయడానికి.
ఫోనులో వ్యక్తి: నువ్వు ఎవరిని సార్, ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి.
ఎమ్మెల్యే: నా ఇష్టం రా బై నేనే ఏడనైనా ప్రచారం చేస్తా.
ఫోనులో వ్యక్తి: నా ఇష్టం సార్, నేను ఎన్నిసార్లు అయిన ఫోన్ చేస్తా. సవాల్ చేసినవ్ కదా!
ఎమ్మెల్యే: బొక్కలు ఇరుగుతయ్ కొడకా. నువు డ్రామాలు చేస్తే.
ఫోనులో వ్యక్తి: ఎవరివి
ఎమ్మెల్యే: నీవే
ఫోనులో వ్యక్తి: నా ఊరిలో నేను ఉంటా.
ఎమ్మెల్యే: మళ్లా జైలు పాలైతువు. జైలుకు పోతావ్
ఫోనులో వ్యక్తి: మొదట నీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి సార్, ఆ తర్వాత పక్క నియోజకవర్గంలో వెళ్లి మాట్లాడాలి.
ఎమ్మెల్యే: అరే హౌలే, బీజేపీ ఒళ్లకు దమ్ములేదు సవాల్ స్వీకరించడానికి అంటూ బూతు పురాణం ఎత్తుకున్నారు.
ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఓ వ్యక్తిపై బూతు పురాణం ఎత్తుకోవడంపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version