28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము రాక..

-

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైనట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11.50 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12:20కి నల్సార్ యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీ 21వ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళామహోత్సవం 2024ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45కు హకీంపేట్ విమానాయశ్రానికి చేరుకుని తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్ లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్‌ విభాగం ఏర్పాట్లను చేయనుండగా, రాష్ట్ర,కేంద్ర బలగాలు పర్యవేక్షణ, భద్రత చర్యల్లో పాల్గొనున్నాయి. ఆ రోజున రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల విధించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version