బతుకమ్మతో ఆమె బరిలోకి దిగుతారా..? అభిమానులు ఏం చెబుతున్నారంటే..

-

తెలంగాణాలో బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్సో.. ఆ పండుగ హడావుడి.. సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ఫేమస్.. పదేళ్ల పాటు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. కేసీఆర్ వారసురాలు, కవిత హడావుడి చేసేవారు.. వారం రోజులపాటు నిత్యం ఒక్క చోట బతుకమ్మలను స్వయంగా పేరుస్తూ వేడుకలు నిర్వహించేవారు.. పది రోజుల్లో ప్రారంభంక కానున్న బతుకమ్మ ఉత్సవాల్లో ఈసారి కవిత పాల్గొంటారా..? అనే చర్చ పార్టీలో జరుగుతోంది..

కేసీఆర్ రాజకీయ వారసత్వంతో కవిత రాజకీయాల్లో వచ్చారు. పోరాటాలు, వాగ్దాటితో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. నిజామాబాద్ ఎంపీగా గెలిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు.. బిఆర్ ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సమానంగా కవిత కూడా పవర్ స్టేషన్ లాగా తయారయ్యారు.. ఎంపీగా గెలిచిన తరువాత కూడా కేవలం ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి కాకుండా.. అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట ప్రజలకు సుపరిచితురాలయ్యారు.. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సుమారు 5 నెలలకు పైగా ఆమె జైలులోనే ఉండిపోయారు. ఈ సమయంలో పార్టీ క్యాడర్ తో పాటు… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కవిత బయటికి ఎప్పుడువస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు..

అయితే ఇటీవల ఆమెకు బెయిల్ రావడంతో బయటికి వచ్చారు.. రాగానే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఆమె.. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.. కుటుంబంతో ఆమె గడుపుతున్నారు.. అయితే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆమె ఎప్పుడు బయటికి వస్తారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది..

ప్రతి ఏటా కవిత తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ ఉత్సవాలను జరుపుతుంటారు. ఈ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్సీ చేసే హడావుడి ఎవ్వరూ చెయ్యలేరు కూడా.. అయితే ఈ సారి కూడా కవిత బతుకమ్మ ఉత్సవాల్లో హాజరవుతారా..? లేదా అనేది ఉత్కంఠగా ఉంది.. ఒకవేళ ఆమె ఉత్సవాల్లో పాల్గొంటే అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు.. బిజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశముందని పార్టీ క్యాడర్ భావిస్తోంది.. కానీ బీఆర్ ఎస్ అగ్రనేతలు మాత్రం కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని చెబుతున్నారు.. వీటన్నింటికి పుల్ స్టాప్ పడాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version