మల్లన్న సాగర్ కి వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్లా..? : మంత్రి పొన్నం ప్రభాకర్

-

మల్లన్న సాగర్ కి వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్లా..? దీనికి మాజీ ఇరిగేషన్  మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ లో వ్యవసాయానికి ఇబ్బంది కలుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ పూర్తయిందని.. పూర్తి కాక ముందే బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 

వాస్తవానికి మిడ్ మానేరు నుంచి వరంగల్ కు రిజర్వాయర్ నీళ్లను నింపింది ఎల్లంపల్లి నుంచే అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లిని కూడా నింపుకోవాలని మేము చూస్తున్నామని తెలిపారు. గౌరవెల్లికి ఇటీవలే రూ. 430 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. నిన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను సందర్శించడానికి మంత్రులు వెల్లారు. రూ.4,637 కోట్లు అంచనా వ్యయం అని అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే  మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లలో ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version