రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

-

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన ఎయిమ్స్‌ ను రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అంతేకాక 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే,రాయ్‌బరేలి,రాజ్‌కోట్‌, భటిండా, కల్యాణి ఎయిమ్స్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతీ పవార్‌,ప్రహ్లాద్‌ జోషిలు పాల్గొననున్నారు.

అలాగే వైజాగ్ లో మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు 4 మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని మోది వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ,కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో ఎయిమ్స్‌ నిర్మించాలని కేంద్రం హామీ ఇచ్చింది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. రూ.1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎయిమ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.

Read more RELATED
Recommended to you

Latest news