సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభం

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరామ్‌పూర్‌లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాగ్రత్తగా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారికి అభివాదం చేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాజెక్టును ప్రారంభించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన ప్రకారం.. 1978లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని, కానీ, నిధులు కేటాయింపులో అలసత్వం, పలు శాఖల మధ్య సమన్వయం లోపించడం, పర్యవేక్షణ లోపం కారణంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. రైతుల సంక్షేమం, సాధికారతపై ప్రధాన మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులుకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version