ప్రో కబడ్డీ సీజన్ 8 ఆటగాళ్ల వేలం షెడ్యూల్

-

దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 8 ప్లేయర్ వేలం ప్రారంభం కానుంది. ప్రో కబడ్డీ సీజన్ వేలం 8 ఆగస్ట్‌ 29వ తేదీ నుంచి 31 మధ్య మూడు రోజుల పాటు జరుగనుంది. ఈ ప్లేయర్ వేలంలో దేశీయ, విదేశీ, మరియు న్యూ యంగ్ ప్లేయర్స్ (NYP లు) A, B, C, D ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించబడ్డాయి. ప్రతి కేటగిరీలో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి.. మళ్లీ అందులోనూ మరోసారి ఆటగాళ్లను విభజిస్తారు. ‘ఆల్-రౌండర్స్ ‘ డిఫెండర్లు ‘మరియు’ రైడర్స్ ‘ఇలా ఆటతీరును బట్టి విభజిస్తారు.

ఇక కేటగిరీ A లో స్థానం దక్కించుకున్న వారికి ఏకంగా… రూ30 లక్షలు, అలాగే… కేటగిరీ B లో చోటు దక్కించుకున్న వారికి రూ. 20 లక్షలు చెల్లిస్తాయి యాజమన్యాలు. అలాగే… కేటగిరీ Cలో చోటు దక్కించుకున్న వారికి రూ. 10 లక్షలు మరియు కేటగిరీ D చోటు దక్కించుకున్న వారికి కేవలం రూ. 6 లక్షలు చెల్లిస్తారు. ప్రతి కేటగిరీలకు బేస్ ధరలు నిర్ణయిస్తారు. సీజన్ 8 కోసం ప్రతి ఫ్రాంచైజీ రూ.4.4 కోట్లు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ఇక సీజన్ 8 లో మొత్తం 500 మందికి పైగా క్రీడాకారులు ఉంటారని తెలుస్తోంది. “రెండు సంవత్సరాల తర్వాతప్రో కబడ్డీ తిరిగి రావడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇది భారతదేశంలో మరియు ప్రపంచంలోని అభిమానులకు అత్యున్నత-నాణ్యత గల కబడ్డీకి నిలయం. సీజన్ 8 కోసం ఆటగాళ్ల వేలం కోసం మేము సిద్ధమవుతున్నప్పుడు ఆటగాళ్లలో విపరీతమైన ఉత్సాహం ఉంది.”అని మషాల్ స్పోర్ట్స్ మరియు లీగ్ కమిషనర్ CEO అనుపమ్ గోస్వామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news