కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మొన్నటి వరకు జమిలీ ఎన్నికల గురించి… పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం… తాజాగా మరోసారి జమిలీ ఎన్నికల పై ఫోకస్ చేసింది.
ఇందులో భాగంగానే.. లా కమిషన్ సిఫారసుల అధ్యయనం చేస్తున్నామని తాజా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2015 -16 మధ్య కాలంలో జరిగిన ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 1490.16 కోట్ల నిధులను విడుదల చేయగా… 2017-18 సంవత్సరం లో 1199.85 కోట్లు విడుదల చేసింది. ఇక 2018-19 సంవత్సరంలో 886.11 కోట్లు ఎన్నికల నిధులు విడుదల చేసింది కేంద్రం. ఇక ఈ జమిలీ ఎన్నికల కోసం కూడా నిధులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఏ క్షణమైన జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జమిలీ ఎన్నికలతో అటు ప్రతి పక్షాల్లోనూ కొత్త టెన్షన్ మొదలైంది.