టీడీపీ గెలవడం ఏమో గాని… ఈ గొడవలు ఎక్కువగానే ఉన్నాయిగా…?

-

తిరుపతి పార్లమెంట్ కు ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు విజయం అనేది తెలుగుదేశం పార్టీకి మంచి ఉత్సాహాన్నిస్తుంది.

మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఈ ఎన్నికలు పార్టీకి చాలా కీలకమని అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు పెద్దగా కష్ట పడే ప్రయత్నం చేయటంలేదు అని అంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కొంతమంది నేతలు పార్టీ కోసం ముందుకు రావడం లేదు. అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా పార్టీని వర్గ విభేదాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి.

నియోజకవర్గ ఇన్చార్జికి అలాగే కొంతమంది స్థానిక నాయకులకు మధ్య విభేదాలు ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కొంతమంది నేతలకు మధ్య పడటం లేదు అనే భావన ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పెద్దగా పని చేసే ప్రయత్నం చేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version