భారత్‌లో కరోనా వాక్సీన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్‌లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. సోమవారం ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్ డోస్ ఇచ్చారు. అయితే వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, బాగా స్పందిస్తున్నారని క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న సీనియర్ వైద్యుడు ఒకరు చెప్పారు.ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాఅనుమతి ఇచ్చింది.
కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మొదటి, రెండో క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతులను ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 వైద్య కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో నిమ్స్ ఒకటి కాగా, దాదాపు 60 మంది అభ్యర్థులపై ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తోంది. ట్రయల్స్ విజయవంతం అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.