గూగుల్ సీఈవోకు నిర్మాత బన్నీవాసు లేఖ… తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆవేదన

-

హైదరాబాద్: గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు నిర్మాత బన్నీ వాసు లేఖ రాశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఓ వ్యక్తి చంపుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పేర్కొన్నారు. వీడియో తీయించడానికి చాలా కష్టపడినట్లు బన్నీ వాసు తెలిపారుప. సోషల్ మీడియా యాజమాన్యాలకు చాలా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని బన్నీ వాసు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా నిర్మాత బన్నీ వాసు కూతురును చంపేస్తానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై బన్నీవాసు తీవ్ర కలత చెందారు. ఎట్టకేలకు ఆ పోస్టును తొలగించారు. మరోవైపు పోస్టు పెట్టిన వ్యక్తి బన్నీవాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పోస్టు పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version