సత్యాగ్రహి పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి సినిమా తెరకెక్కనుందని అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి అయితే ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది అయితే ఎందుకు గల అసలు కారణాలు ఏంటో ఇన్నాళ్లకు నిర్మాత వివరించారు..

పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి సినిమాను తీయాలని భారీగా ప్లాన్ చేశారు నిర్మాత ఎఎమ్ రత్నం అలాగే ఈ సినిమాను రాజకీయ నేపథ్యంలో తర్కెక్కించాలని కూడా అనుకున్నారు.. కొన్ని ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని అధికారులు కూడా ప్రకటించేశారు.. అలాగే పవన్ కళ్యాణ్ తో కృషి సినిమాను నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఏం రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యంలో రాబోయే ఈ సినిమా పైన ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు అయితే సినిమా మాత్రం ఆగిపోయింది ఇందుకు గల కారణాలు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు అయితే దీనిపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తూ వచ్చాయి నిర్మాత దర్శకుల మధ్య కథ విషయంలో కొన్ని గొడవలు వచ్చాయని స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో రాయలేదని అనుకున్న స్థాయి కంటే బడ్జెట్ ఎక్కువైంది అంటూ ఎవరికి వారే అనుకుంటూ వస్తున్నారు అయితే ఇన్నాళ్లకు ఈ విషయంపై నిర్మాత ఎఎమ్ రత్నం ఏమన్నారు అంటే.. …“జాని చిత్రం రిజల్ట్ చూసాక, పవన్ చాలా నిరాశపడ్డారు. ఆయన డైరక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని భావించారు. దాంతో సత్యాగ్రహి చిత్రంపై మా డబ్బుని రిస్క్ చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేసారు ”.. అంటూ చెప్పుకొచ్చారు..

అయితే ఇంతకుముందు దీనిపై పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారింది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కాలంలో జరిగిన ఎమర్జెన్సీ ఉద్యమం నుండి ఈ కథను తీసుకున్నారు అయితే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యంలో లో తెరకెక్కిచిత్రం ఈ కథ మొత్తం 2003లో జరిగిన పరిస్థితులు చుట్టే తిరుగుతూ ఉంటుంది అయితే ఈ సినిమాలో నటించడం కంటే నిజజీవితంలో అందుకోసం కృషి చేయడం సంతృప్తిని ఇస్తుందంటే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్..

Read more RELATED
Recommended to you

Exit mobile version