తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

-

టాలీవుడ్ నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జెమినీ కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్‌ విజయం సాధించారు. ఇవాళ నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం ఓట్లు 1,134 ఓట్లుకు గాను.. 677 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు.. జెమినీ కిరణ్‌కు 322 ఓట్లు వచ్చాయి.

కాగా మండలి సెక్రటరీలుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి లు ఎన్నికైయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా భరత్‌ చౌదరి, నట్టికుమార్‌ ఎన్నికయ్యారు. నిర్మాతల మండలికి సాధారణంగా షెడ్యూల్‌ ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళన చేపట్టడంతో ఇవాళ హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version