మరోసారి మోడీ వస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తాడు: ప్రొఫెసర్ హరగోపాల్

-

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్ పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాలులా భారతదేశంలోనూ మత విలువలు ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతుందని ఆయన అన్నారు రాజ్యాంగం నైతికత అనే అంశంపై తిరుపతి పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో సదస్సుని నిర్వహించారు. అయితే ఇందులో అయినా మాట్లాడటం జరిగింది అలహాబాద్ నిర్వహించిన కుంభమేళా లో దేశానికి కొత్త రాజ్యాంగం తయారు చేశారని అన్నారు.

 

2024 ఎన్నికల తర్వాత దానికి మద్దతు లభిస్తే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హరగోపాల్ అన్నారు. ఇస్లాం క్రైస్తవంలో ఒకే దేవుడు ఒకే తాత్వికచింతన ఉంటుందని అన్నారు ప్రస్తుత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు సమానత్వాన్ని అంగీకరించని వారు ఉన్నారు అని అన్నారు. ప్రస్తుత రాజ్యాంగంలో పేర్కొంటున్న సమాజం కంటే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవాలని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version