Professor Kodandaram : మంత్రివర్గంలోకి కోదండరామ్..! సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ క్లియరెన్స్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైన అంశాలపై హైకమాండ్ తో చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు మాత్రమే నామినేటెడ్ పదవుల్లో మొదటగా ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.అనుబంధ సంఘాలు,టికెట్ రాకున్నా పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేసిన, చివరి నిమిషంలో టికెట్ వచ్చి క్యాన్సిల్ అయిన వాళ్లు,పార్టీలో కీలకంగా ఉండి టికెట్ రాని వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు,రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఉన్నాయి.

కాగా, గవర్నర్ కోటాలో ఒక స్థానాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండో స్థానం కోసం విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్ పేరు, కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అందెశ్రీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version