ప్రాజెక్ట్ చీతా: కునో పార్క్ లో “సూరజ్” చిరుత మృతి…

-

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా అన్న ప్రాజెక్ట్ ను దృష్టిలో పెట్టుకుని గతంలో నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల నుండి మొత్తం 20 చీతాలను ఇండియాకు తీసుకువచ్చింది. ఈ చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పార్క్ లో సంరక్షిస్తూ ఉంది. కానీ కారణాలు ఏమిటన్నది తెలియదు.. ఈ చీతాలు ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాయన్నది అక్షర సత్యం. జంతువులు కానీ మనుషులు కానీ పరిసరాల ప్రభావం మరియు వార్తవరణ పరిస్థుతుల మార్పు వలన జీవన విధానంపై ప్రభావం చూపిస్తుంది. వీటి విషయంలో అదే జరిగిందని అనుకోవలసి వస్తుంది, ఎందుకంటే గత నాలుగు నెలల కాలంలో ఈ పార్క్ లో మొత్తం ఎనిమిది చిరుతలు మరణించడం జరిగింది. ఈ రోజు ఉదయం సూరజ్ అనే ఒక చిరుత కూడా చనిపోయినట్లు కునో పార్క్ అధికారులు ధ్రువీకరించారు. కాగా ఈ మధ్యనే తేజస్ అనే ఒక మగ చిరుత మరణించింది.

 

ఎందుకు ఈ చీతాలు మరణిస్తాయని ఖచ్చితమైన ఆధారాలు అయితే ఇప్పటి వరకు తెలియడం లేదు. ఇక మిగిలింది కేవలం 12 చీతాలు మాత్రమే. వాటిని అయినా కునో పార్క్ అధికారులు సక్రమంగా చూసుకుని రక్షిస్తారా ?

Read more RELATED
Recommended to you

Latest news