అక్కడ చేపలను ఎలా అమ్ముతారో తెలుసా…? చేపలు కావాలంటే వ్యభిచారం చెయ్యాలా…?

-

ప్రపంచంలో తిండి దొరకక ప్రజలు పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతుందని ప్రభుత్వాలు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా లక్షలాది మంది ప్రజలు పొట్ట కూటి కోసం పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో అయితే ఎంతో మంది పస్తులు పడుకోవడం చేస్తూ ఉంటారు. అక్కడి ప్రభుత్వాలకు సమర్ధత లేకపోవడం, అమెరికా లాంటి దేశాల పెత్తనం ఎక్కువగా ఉండటంతో ఆఫ్రికా ప్రజలు ఇంకా ఆకలితో అలమటించిపోతున్నారు. ఇక భర్తలు లేని ఆడవారి పరిస్థితి,

మరీ దారుణంగా ఉంటుంది… పిల్లలను పోషించడానికి వారు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలను పోషించడానికి, వారి కడుపు నింపడానికి ఆడవారు ఏకంగా పడుపు వృత్తిలోకి దిగుతున్నారు. కెనాలోని మారుమూల ప్రాంతం అయినా హోమాయిలో ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్క పూట తిండి దొరికితే చాలు అనుకుని బ్రతుకుతున్నారు. అక్కడ ఎక్కువగా చేపలను పట్టి జీవించే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా వారిలో మహిళలు ఎక్కువగా ఉంటారు…

చేపలు దొరికినన్ని రోజులు పరిస్థితి బాగానే ఉంటుంది. దొరకకపోతే అక్కడి జాలర్లను అడిగి చేపలు తీసుకోవాలి… వాటిని అమ్ముకోవాలి. దీనిని ఆసరాగా తీసుకున్న జాలర్లు కొందరు… వాటిని అమ్మకుండా అవి ఇవ్వాలి అంటే ఆడవారు తమతో పడుకోవాలి అని షరతు పెడుతూ ఉంటారు. దీనితో తప్పని పరిస్థితుల్లో ఆడవారు ఆ వృత్తిలోకి బలవంతంగా దిగి పిల్లలను పోషించుకుంటూ ఉంటారు. ఈ పద్దతిని జజ్వా అంటారు. వేలాది మంది మహిళలు ఈ పద్దతిలోనే తమ పిల్లలను పోషించుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడి ఆడవారికి ఇది తప్ప మరో మార్గం లేదట.

Read more RELATED
Recommended to you

Exit mobile version